రూ 5 లక్షలిచ్చి కాపీ కొట్టారు..!

rubi-raiపాట్నా లోని వి.ఎన్.రాయ్ కాలేజీలో 12వ తరగతి పరీక్షలో కాపీయింగ్ ఘటన దర్యాప్తులో నిజాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. కాపీయింగ్ కు తలకు ఐదు లక్షల చొప్పున ఒప్పందం కుదిరింది.

ఈ కుంభకోణంలో టాపర్ రూబీరాయ్ తోపాటు మరో ముగ్గురు విద్యార్థులున్నారు. రూబీరాయ్ అరెస్టయి బెయిలుపై విడుదలయ్యింది.

సైన్స్ లో మూడో ర్యాంక్ సాధించిన రాహుల్ ను అరెస్టు చేసి విచారించగా తాము పరీక్ష కేంద్రానికి వచ్చి ఆన్సర్ షీట్ పై పేరు రాసి వెళ్ళిపోయి, తిరిగి సాయంత్రం వచ్చి చీటీలు చూసి రాశామన్నాడు.

మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈ సంఘటనలో వి.ఎన్.రాయ్ కాలేజీ ప్రిన్సిపాల్ బచ్చారాయ్ తోపాటు 47 మందిని అరెస్టు చేశారు. రాజనీతి శాస్త్రంలో టాపరైన రూబీరాయ్ ని పొలిటికల్ సైన్స్ అంటే ఏమిటనీ ప్రశ్నిస్తే కుకింగ్ అని సమాధానమివ్వడం, దాంతో పేపర్ లీకేజీ, కాపీయింగ్ విషయం బయటపడడం, వారిని అరెస్ట్ చేయడం జరిగింది.