రూ.7కోట్లతో ఉడాయించిన శ్రీసాయి డెవలపర్స్
హైదరాబాద్:శ్రీసాయి డెవలపర్స్ పేరుతో ప్రజల నుంచి రూ.7కోట్ల వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు.ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.నగరంలోని గాంధీనగర్‌లో ఒక అపార్టుమెంటు నిర్మాణం చేపట్టేందుకు స్థల యజమాని నుంచి సంస్థ యజమాణణని శ్రీనివాస్ అగ్రిమెంట్ చేసుకున్నాడు.ఆ తర్వాత ప్లాట్ల అమ్మకాలు పెట్టాడు.సగం వరకు నిర్మించి బిల్డరు ప్లాట్లు కొనుగోలు చేసిన వారినుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఉండాయించాడు.ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.20లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేశాడు.కొన్ని రోజులుగా నిర్మాణం సాగక పోవటంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అనుమానం రావటంతో సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు.దీంతో మరో విషయం బయటపడింది.ఒక్కో ప్లాట ముగ్గురికి,నల్గురికి అగ్రిమెంటు చేసి లక్షలాది రూపాయలు దండుకున్నాడు.దీంతో మోసపోయామని గ్రహించిన బాదితుతంతా ముషిరాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు.ఇప్పటి వరకు బాధితుల నుంచి దాదాపు రూ.7కోట్ల వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని,ఇంకా ఎవరైనా ఉంటే పిర్యాదు చేయాలని పోలీసు అధికారులు పేర్కొన్నారు.