రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 15 మందికి గాయాలు

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లి కూడలి వద్ద 65వ నెంబర్‌ జాతీయరహదారిపై ఈ ఉదయం రెండు బస్సులు ఢీ కొన్నాయి.  ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. హైదరాబాద్‌ వెళ్తున్న  నార్కట్‌పల్లి డిపో బస్సు, సంగారెడ్డికి వస్తున్న నారాయణఖేడ్‌ డిపో బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులనుసంగారెడ్డి ఆసుపత్రికి తరలించిన్నట్లు సమాచారం.