రెండు చానళ్లపై వేటు

news-time-assam-new_07-apr-2013_15_50_10కేంద్ర ప్రభుత్వం మరో రెండు చానళ్లపై వేటు వేసింది. ‘న్యూస్ టైం అస్సాం’ చానల్ పలుసార్లు మార్గదర్శకాలను ఉల్లంఘించి, క్షమాపణ కోరుతూ సవరణ ప్రసారం చేయమన్నా చేయలేదు. దీంతో నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి 10 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ఆ చానల్ ప్రసారాలు నిలిపివేయాలని సమాచార, ప్రసారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. యజమాని చేతిలో దారుణ చిత్రహింసలకు గురైన పని పిల్లవాడి గుర్తింపు తెలిపేలా ఈ చానల్ ప్రసారాలు చేసి, అతని గౌరవానికి భంగం కలిగించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో ఉత్తర్వులో ‘కేర్ వరల్డ్ టీవీ’ అనే చానల్‌ను కూడా ప్రభుత్వం నిషేధించింది. అభ్యంతరకర దృశ్యాలను చూపించడంతో నవంబరు 9 నుంచి ఈ చానల్ ప్రసారాలను వారం రోజులపాటు నిషేధించింది.