రెండు తప్పిదాలు చేశాను: యడ్యూరప్ప

బెంగుళూరు: నవంబర్‌ 14, (జనంసాక్షి):

జీవితంలో రెండు అతి పెద్ద తప్పులు చేశానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఒకటి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, రెండొది కొత్త పార్టీ ఇంకా ముందుగానే ప్రారంభించకపోవడం అని చెప్పారు. ఈ తప్పులను పునరావృతం చేయనని అన్నారు.బెంగళూరులోని తన స్వగృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.గనుల అక్రమ తవ్వకంపై లోకాయుక్త నివేదిక సమర్పించగానే తాను రాజీనామా చేసి ఉండకూడదని అన్నారు. ఆ నివేదికలో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఎక్కడా పేర్కోనలేదని,70మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ తాను రాజీనామా చేశానని చెప్పారు.అలాగే హుబ్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించినపుడే కొత్త పార్టీని ప్రారంబించాల్సిందని అబిప్రాయపడ్డారు.బీజేపీ నాయకులు తనను తప్పుదోవ పట్టించి నాశనం చేశారని అన్నారు.వారిని తాను నమ్మి ఉండాల్సింది కాదని చెప్పారు.

జగదీష్‌ షెట్టార్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలకు తాను మద్దతు ఇవ్వబోనని యడ్యూరప్ప అన్నారు.రానున్న అసేంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆవిశ్వాసం పెట్టినా,దానికి తాను మద్దతివ్వబోనని స్పష్టీకరించారు.