రెండు ద్విచక్రవాహనాల ఢీ: ఒకరి మృతి
సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి మండలం కంది శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో పదో తరగతి విద్యార్థి సంతోష్ సాయి బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌బాబు పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరూ సంగారెడ్డిలోని విద్యానగర్ కాలనీకి చెందినవారు. రేపు పరీక్ష ఉన్న సందర్బంగా చదువుకోవడానికి వీరిదరూ కలుసుకున్నట్లు సమాచారం.