రెండు ఫోటోలు వచ్చేటట్టు చూడండి సార్
భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు
అయిజ,జూన్ 12 (జనం సాక్షి)
జోగులాంబ గద్వాల జిల్లా సోమవారం నుండే పాఠశాలల పున. ప్రారంభం
1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ బోధన గద్వాల జిల్లా డి ఈ ఓ మొహమ్మద్ సిరాజుద్దీన్ ,జిల్లాలో జూన్ 13వ తేదీ నుంచి పాఠశాలల పున.ప్రారంభం యధావిధిగా కొనసాగుతోందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వల్ల రెండేళ్లుగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తం మారిందన్నారు. అయినా ఇబ్బందులు లేకుండా విద్య అందించేందుకు కృషి చేశామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు ఆన్ లైన్ పాఠాలు అందేలా చేశామని పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు చేయాలని మండల అధికారులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ పాఠశాలలకు పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన నిర్వహించామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన వారికి ఆంగ్ల శిక్షణ ఉంటుందని వెల్లడించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన ఉంటుందని, తల్లిదండ్రుల అభీష్టం మేరకు ఏ మీడియంలో కావాలంటే ఆ మీడియంలో నమోదు చేయవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంచేలా ఒక నెల బ్రిడ్జ్ కోర్స్ క్లాసెస్ లాగా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు ఇదివరకే రోజువారీ కార్యక్రమాల వివరాలను తెలపడం జరిగిందని తెలిపారు. యథావిధిగా పాఠ్యపుస్తకాలు, ప్రభుత్వం అందించిన వెంటనే యూనిఫార్మ్స్ కూడా అందిస్తామని, ఇప్పటివరకు లక్షా పుస్తకాలు జిల్లాకు వచ్చాయని తెలిపారు. ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధన అందించాలని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు సూచించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ను స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రధానోపాధ్యాయులు చూసుకోవాలని కోరుతున్నామన్నారు. అన్ని పాఠశాలలలో మిషన్ భగీరథ నీటి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని, సోమవారం పాఠశాలల పున ప్రారంభం రోజున స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పాఠశాలలకు విద్యార్థులను స్వాగతం పలకాలని కోరుతున్నామని తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
ఈనెల 30వ తేదీ వరకు రోజువారీగా,చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలు:
13వ తేది మన ఊరు.మన బడి.మన బస్తీ.మన బడి, 14వ తేదీ ఇంగ్లిష్ మీడియాన్ని బడుల్లో ప్రవేశపెట్టిన విషయాన్ని వివరించడం, 15వ తేది తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం, 16వ తేదీ స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ సమావేశం, 17వ తేదీ స్వయం సహాయక బృందాలతో సమావేశం,18వ తేదీ బాలికల విద్య అండ్ కెరీర్ గైడెన్స్, 20వ తేదీ సామూహిక అక్షరాభ్యాసాలు, 21వ తేదీ స్వచ పాఠశాలలు నిర్వహణ కార్యక్రమాలు చేపట్టడం, 22వ తేదీ హరితహారం, పాఠశాలలు మరియు విద్యార్థుల గృహ నివాసాల వద్ద ఏర్పాటు చేయడం పై ప్రేరణ కలిగించడం, 23వ తేదీ ప్రత్యేకావసరాలు గల పిల్లల నమోదు తదితర కార్యక్రమాలు, 24వ తేదీ బాల సభ నిర్వహణ, 25వ తేదీ గ్రంథాలయ రోజు చదువల మేళా, 27వ తేదీ బడి బయటి విద్యార్థుల నమోదు, 28వ తేదీ ఆంగ్లం మరియు తెలుగు ద్విభాషా పాఠ్య పుస్తకాలపై అవగాహన కల్పించటం, 29వ తేదీ డిజిటల్ ఎడ్యుకేషన్ మరియు 30వ తేదీ గణితం, సైన్స్ డే నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల పై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ బోధన సామర్థ్యాలతో విద్యార్థులను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖను రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థానంలో నిలిచేలా కృషి చెయ్యాలని గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ మహ్మద్ సిరాజుదిన్ గారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు. ఇట్టి ఆదేశాలను తుచా తప్పకుండా పాటిస్తామని ఐజ, రాజోలి మరియు వడ్డేపల్లి మండల విద్యాధికారి బి నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు.
2 Attachments