రెండు బస్సుల ఢీ: పదిమందికి గాయాలు
సంగారెడ్డి,జూన్7(జనం సాక్షి): జిల్లాలోని కోహిర్ మండలం కొత్తూర్(డి) వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేటు బస్సును కర్ణాటక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.