రెండు రోజుల పర్యటన సంతృప్తికరం: గవర్నర్
వరంగల్, మార్చి 25: వరంగల్ జిలాల్లో తన పర్యటన సంతృప్తికరంగా ముగిసిందని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంద న్నారు. మిషన్ కాకతీయ పనులు బాగా జరుగుతున్నాయని ప్రశంసించారు. ప్రతి చెరువును బాగు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చెరువులన్నీ నిండితే రైతులు బాగుపడతారని, బాగు చేసిన వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ముక్తాయించారు.