రెండు వేర్వేరు ఆర్టీసీ బస్సు ప్రమాదాలు
నలుగురు మృతి
మెదక్,సెప్టెంబర్8(జనంసాక్షి): రెండు ఆర్టీసీ బస్సుల కారణంగా నలుగురు మృతి చెందారు. ఇందులో ఒకటి మెదక్ జిల్లాలో, మరోటి నిర్మల్ జిల్లాలో జరిగింది. రెండు ప్రమాదాల్లోనూ ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల్నే జరిగిందని తెలుస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనాలపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరిని నర్సాపూర్ వాసులు విూర్జాసల్మాన్‌బేగ్, ఎండీ అజ్మత్‌గా గుర్తించారు. అతిగవేగంగా వస్తున్న బస్సు ఈ రెండు వాహనాలను బలంగా ఢీకొనడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండల కేంద్రంలోని డ్యాంగాపూర్ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 14 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాధితులను పరామర్శించారు.