రెండు సార్లు పెళ్లి: విడాకులు తీసుకోవాలని దంపతులకు బెదిరింపులు

బెంగళూరు: ఐదు సంవత్సరాలు ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్న నవదంపతులను చంపేస్తామని అమ్మాయి కుటుంబ సభ్యులు బెదిరించారని బెంగళూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. బెంగళూరులోని పులకేశీనగర, అమృతహళ్ళి పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు చేశామని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమృతహళ్ళిలో బాలరాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను సోంతంగా వ్యాపారం చేస్తున్నాడు. పులకేశీనగరలో నివాసం ఉంటున్న ఖురత్ అలదిన్ అనే యువతి ప్రయివేటు కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నది. బాలరాజ్, ఖురత్ లకు ఐదు సంవత్సరాల నుండి పరిచయం ఉంది. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో స్నేహితుల షహాయంతో ఒకటిన్నర సంవత్సరం క్రితం ఇద్దరు బెంగళూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఖురత్ కుటుంబ సభ్యులకు భయపడి ఎవరి ఇంటిలో వారు నివాసం ఉంటున్నారు. ప్రత్యేకంగా కాపురం పెట్టే ధైర్యం చెయ్యలేకపోయారు. ఇటివల ఖురత్ కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చెయ్యడానికి సిద్దం అయ్యారు. పెళ్లి కుమారుడిని చూశారు. పరిస్థతి చెయ్యిదాటుతుందని బావించిన ఖురత్ తన ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. బాలరాజును వివాహం చేసుకుంటానని చెప్పింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. అతని మతం వేరు, మన మతం వేరు, పెళ్లి చేసుకొవడానికి ఎట్టి పరిస్థతిలో అంగీకరించమని తేల్చి చెప్పారు. రెండు సార్లు పెళ్లి: విడాకులు తీసుకోవాలని దంపతులకు బెదిరిం ఖురత్ చాల విదాలుగా కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ఫిబ్రవరి 2వ తేదిన ఖురత్ ఇంటి నుండి పారిపోయి వచ్చింది. బాలరాజు, ఖురత్ బెంగళూరులోని హలసూరులోని ఒక దేవాలయంలో హిందూ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు. తరువాత వేరే చోట కాపురం పెట్టారు. తెలిసిన వారి ద్వార తనకు వివాహం అయ్యిందని ఖురత్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. లవ్ జీహాద్ ముసుగులో మా అమ్మాయిని తీసుకు వెళ్లారని ఖురత్ కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడ్డారు. బంధువుల ద్వార ఖురత్, బాలరాజు ఉన్న ఇంటిని గుర్తించారు. వెంటనే విడాకులు తీసుకుని ఇంటికి రాకపోతే ఇద్దరిని చంపేస్తామని ఖురత్ కుటుంబ సభ్యులు బెదిరించారు. కుటుంబ సభ్యుల గురించి బాగ తెలిసిన ఖురత్ భయంతో హడలిపోయింది. ఒకసారి బాలరాజు మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఇక లాభం లేదని తెలుసుకున్న ఇద్దరు శుక్రవారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కార్యాలయం చేరుకున్నారు. మాకు న్యాయం చెయ్యాలని మనవి చేశారు. మా మతాలు వేరు అయినా ఇద్దరిలో ప్రవహిస్తున్న రక్తం రంగు ఒక్కటే, నేను బాలరాజుతోనే కలిసి జీవిస్తానని, న్యాయం చెయ్యండి అంటు ఖురత్ లిఖితపూర్వకంగా మనవి చేసింది. వివరాలు తెసుకున్న అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ ఇద్దరికి ధైర్యం చెప్పారు. మొదట మీరు రెండు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చెయ్యండి. తరువాత మా పని మేము చేస్తాం అని చెప్పి పంపించారు. అయితే ఖురత్ కుటుంబ సభ్యులు, బంధువులు రాజీకి అంగీకరించడం లేదని తెలిసింది. పోలీసులు ఖురత్, బాలరాజు కుటుంబ సభ్యులను పిలిపించి రాజీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.