రెండోరోజుకు చేరిన సార్వత్రిక సమ్మె : ఏటీఎంలలో డబ్బుల్లేవ్‌!

ఢిల్లీ : సార్వత్రిక సమ్మె రెండో రోజుకు చేరడంతో ప్రజల ఇబ్బందులు పెరిగాయి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలోనూ బ్యాంకులు పనిచేయకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలోని ఏటీఎంలలో చాలా చోట్ల డబ్బులు లేక ప్రజలు అవస్థపడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు కూడా నిలిచిపోయాయి. ప్రజారవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరిగి రహదారులు కిక్కిరిసి కన్పిస్తున్నాయి. బ్యాంకు ప్రాంగణాలు, బస్సు, రైళ్ల స్టేషన్లు నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు,  కళాశాలలకు కూడా మూతపడ్డాయి. నోయిడాలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఈరోజు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ఒక్కటే పూర్తిగా బంద్‌కు దూరంగా ఉండిపోయింది.