రెండో రోజు అక్బరుద్దీన్ విచారణ
ఆదిలాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను రెండో రోజు ఆదిలాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. నిర్మల్‌లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద ప్రసంగం సీడీల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. న్యాయవాదులు అక్బర్ హుస్సేన్, బలరాజ్ సమక్షంలో ఈ విచారణ జరుగుతోంది. ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతివ్వడంతో నిన్న పోలీసులు అక్బరుద్దీన్‌ను ప్రశ్నించారు.