రెండో రోజు సమ్మె సక్సెస్
-కాంట్రాక్టు కార్మిక సంఘాల తో చర్చలు జరపాలి
–సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ మట్టడిస్తాం– జేఏసీ
టేకులపల్లి, సెప్టెంబర్ 10( జనం సాక్షి ): కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల జెఏసి నాయకులు డి ప్రసాద్,రేపాకుల శ్రీనివాస్,గుగులోత్ రాంచందర్,కోటిలింగం సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కోయగూడెం ఓసీ, సింగరేణి కాలనీ లో కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె రెండో రోజు సమ్మె లో పాల్గొని జయప్రదం చేశారని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కడుదుల వీరన్న, ఐత శ్రీరాములు, భద్రయ్య, శివ,చారి తదితరులు పాల్గొన్నారు.