రెండో రోజూ నిరసనల హోరు..

4

– పార్లమెంట్‌ను కుదిపేసిిన నేషనల్‌ హెరాల్డ్‌ కేసు

న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జనంసాక్షి): నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంపై రగడ రెండోరోజు కొనసాగింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు ఇవాళ కూడా ఆందోళన కొనసాగించారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ బుధవారం ఉదయం కాంగ్రెస్‌ సభ్యులు నిరసనలు, నినాదాలతో ¬రెత్తించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌పై  కేంద్ర ప్రభుత్వం  కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అధికార విపక్ష సభ్యలు మద్య మాటల యుద్దం సాగింది. రాజ్యసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన సభను 11.30 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు లోక్‌ సభలోనూ నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై గందరగోళం నెలకొంది. కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ సభ్యుల నిరసనల మధ్య సమావేశాలు కొనసాగించారు.  ప్రశ్నోత్తరాల తర్వాత విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… విపక్షంపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.  హర్యాణాలో అక్రమంగా సీబీఐ కేసులు బనాయిస్తున్నారన్నారు. దేశంలో రెండు చట్టాలున్నాయని, ఒకటి అధికారపార్టీకి, మరొకటి విపక్షానికి అని వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ దాడులతో విపక్షాలను భయపెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ముజఫర్‌నగర్‌లో ఓ కేంద్రమంత్రి జైలుకెళ్లి నిందితులను కలిశారని, వీకేసింగ్‌ దళితులను అవమానించేలా మాట్లాడారని ఖర్గే విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మండిపడ్డారు. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కోర్టు కేసులకు పార్లమెంటుకు సంబంధం ఉంటుందా అని అన్నారు.  లోక్‌సభలో విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. యూపీఏ పాలనలో అమిత్‌షాను జైలుకు పంపారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ సభ్యులు దేశాభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. కరవుపై చర్చ జరగకుండా కాంగ్రెస్‌ సభ్యులు సభను అడ్డుకున్నారరని ఆరోపించారు. కావాలనే కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు సభను అడ్డుకోవాలని చూస్తున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు.నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగి,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఆ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. భలో కరువుపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై వెంకయ్య మండిపడ్డారు. కోర్టు ఆదేశాల్లో ప్రభుత్వ పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రులు సమర్థవంతగా పని చేస్తున్నారన్నారు. అందుకు తమకు గర్వంగా ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. గత యూపీఏ పాలనలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను జైలుకు పంపిన సంగతిని ఈ సందర్భంగా వెంకయ్య గుర్తు చేశారు.నేషనల్‌ హెరాల్డ్‌ కేసు యుపిఎ హయాంలోనే నమోదు అయిందని,ఇప్పుడు ఎన్‌.డి.ఎ అదికారంలో ఉందని, కావాలని కాంగ్రెస్‌ ఎంపిలు ఆందోళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో మంత్రులు ఎవరూ తప్పు చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ వార్టీ వారు ఎందుకు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియడం లేదని,ప్రజలంతా గమనిస్తున్నారని వెంకయ్య నాయుడు తీవ్రంగా స్పందించారు. సభను అడ్డుకోవడం తగదని ఆయన అన్నారు. సభకు

ఆటంకం కలిగించవద్దని స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ పదేపదే కోరారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌ సభలో పోడియంలోనే భైటాయించారు. దాంతో స్పీకర్‌ తాను కాంగ్రెస్‌ సభ్యులను హెచ్చరిస్తున్నానని కూడా వ్యాఖ్యానించారు.  మల్లిఖార్జున్‌ ఖర్గే లోకసభలో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో రెండు చట్టాలను అమలు చేస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విపక్షాలకు ఒక చట్టం, బీజేపీకి ఒక చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. సీబీఐ, ఈడీలతో విపక్షాలను భయపెట్టలేరని ఖర్గే తీవ్ర స్థాయిలో గళమెత్తారు. రెండు నాల్కల ధోరణితో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఖర్గే అన్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్‌ దమన నీతిని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీకే సింగ్‌ను వెంటనే తప్పించాలని చేయాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. కోర్టు తీర్పును కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని వెంకయ్య ఆరోపించారు.