రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వృద్దులకు ఉచిత వైద్య చికిత్స సంచార వాహనం ప్రారంభం

నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై 18(జనంసాక్షి):నాగర్ కర్నూల్ రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వృద్దులకు ఉచిత వైద్య చికిత్స నిర్వహణకు సంచార వాహనాన్ని నేడు నూతన జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్,జిల్లా అడిషనల్ కలెక్టర్ మను చౌదరి ప్రారంభించారు.ఈ సంద్భంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ,వృద్ధులకు ఇంటివద్దనే సేవలందించేందుకు రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహాకారంతో ఏర్పాటు చేసిన సంచార వైద్య వాహన సేవలు నిర్దేశించిన మారుమూల గ్రామాలలోని వృద్ధులకు అందుబాటులోకి వచ్చాయని,వృద్ధులకు వచ్చె ప్రధాన అరోగ్య సమస్యలైన రక్తపోటు,మధుమేహం,ఆస్తమా లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తారని,వృద్దులు ఈ సేవలను ఉపోయోగించుకోవలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి/రెడ్ క్రాస్ ఛైర్మెన్ డా,కె.సుధాకర్ లాల్,DWO వెంకటలక్ష్మీ,రెడ్ క్రాస్ సెక్రటరి రమేష్ రెడ్డి,ట్రెజరర్ రాధాకృష్ణ,వైస్ చైర్మన్ శ్రీధర్,యూత్ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ డి.కుమార్,మేనేజింగ్ కమిటీ సభ్యులు కృష్ణ రావు,సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు.