రెవణ సిద్దేశ్వర స్వామి ఆలయం లో లక్ష బిల్వార్చన
ఝరాసంగం ఆగస్టు 21( జనంసాక్షి) మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామంలో శ్రీ రేవన సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో గణేష్ పటేల్అనితమ్మ దంపతుల ప్రత్యేక పూజలు శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం మరియు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మాతృశ్రీ శివ లీలమ్మ, గ్రామ సర్పంచ్ బసవరాజ్ పాటిల్ ఎంపిటిసి శంకర్ పాటిల్, తెరాస మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి, గ్రామ పెద్దలు నాగేష్ పాటిల్, హనుమంత్ రెడ్డి సంగమేశ్వర్ పండరి తదితరులు పాల్గొన్నారు.