రెస్ట్రో రిసార్ట్స్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలువురు నాయకులు
ఝరాసంగం అక్టోబర్ 16 (జనంసాక్షి) మండల కేంద్రంలో కేతకి సంఘమేశ్వర దేవాలయం సమీపంలో నూతనంగా ప్రారంభించిన వి 5 రెస్ట్రో రిసార్ట్స్ హొటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీపీసీసీ నాయకులు వై.నరోత్తం లు మాట్లాడుతూ పచ్చని పంట పొలాల మద్య ఆహ్లాదకరమైన వాతావరణంలో హోటల్ ఏర్పాటు చేయడం సంతోషకరమని కేతకి ఆలయానికి వచ్చే భక్తులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని యాజమాన్యానికి అభినందించి,శుభాకాంక్షలు తెలపడం జరిగింది,సంఘమేశ్వర స్వామి వారి కృపతో రిసార్ట్స్ హోటల్ వ్యాపారం మంచిగా జరగాలని కోరుకున్నారు,ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జాగదీశ్వర్, మాజీ సొసైటీ చైర్మన్ సంగారెడ్డి నర్సింహ గౌడ్, ,మండల పరిషత్ ఉపాధ్యక్షులు మల్లన్న పాటిల్, సర్పంచ్ లు మోహన్ రెడ్డి,నవాజ్ రెడ్డి,శ్రీనివాస్,మాజీ సర్పంచ్ లు శంకర్,పెంటయ్య,నాయకులు యం.డి.యూసుఫ్,శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,ప్రకాష్,నబి పటేల్,శివకుమార్,విష్ణువర్ధన్ రెడ్డి,అనంత్ రాం గౌడ్,.రాజు, భాస్కర్ రెడ్డి,రాజు,నాగేష్,జె.రాజు స్వామి లింగాయత్ సమాజ్ నాయకులు,,రిసార్ట్స్ యాజమాన్యం తదితరులు ఉన్నారు.