రేణుక ఎల్లమ్మ వద్ద స్నానాల గదుల ప్రారంభం.
మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు:23మల్లాపూర్ మండల్ సాతారం గ్రామంలో మంగళవారం రేణుక ఎల్లమ్మ వద్ద నిర్మించిన స్నానాల గదులను ప్రారంభించారు ఎల్లమ్మ వార్షికోత్సవం సందర్భంగా సుద్దాల మురళి పద్మ దంపతుల కుమారుడైన సుద్దాల నరేష్ హరిప్రియ గార్లచే నిర్మించిన మూడు స్నానాల గదులను ఈరోజు వారి తల్లిదండ్రులు అయినట్టు సుద్దాల మురళి పద్మ గారు ప్రారంభించారు దేవస్థానం వచ్చిపోయే మహిళలకు ఇబ్బంది కలగడంతో వారికి విన్నవించడంతో 1,60,000తో 3 స్నానాల గదులను నిర్మించి ఈరోజు ప్రారంభించారు. వచ్చిపోయే భక్తులు మరియు గ్రామస్తులు నరేష్ హరిప్రియ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు