రేపటి నుండే కొత్త నోట్లు..!!

new-500-200-rupee-note_650x400_41478619220రూ.500, రూ.2,000 విలువ ఉన్న కొత్త కరెన్సీ నోట్లను గురువారం నుంచి విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. వీటికి నకిలీలను తయారు
చేయటానికి వీల్లేకుండా రూపొందించామని, భద్రతపరంగా డిజైన్ తదితర అంశాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది. గురువారం నుంచి బ్యాంకుల్లో నోట్లమార్పిడి ప్రక్రియ మొదలవుతుందని పేర్కొంది.ఈనెల 10 నుంచి రూ.500, రూ.2000లకు సంబంధించిన కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇతర విలువ కలిగిన కరెన్సీనోట్లను తదనంతరకాలంలో దశలవారీగా విడుదల చేస్తామని తెలిపింది. కొత్త నోట్లకు నకిలీలను తయారుచేయటానికి వీల్లేకుండా భద్రతపరంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. బ్యాంకులు బుధవారం పనిచేయవని, గురువారం నుంచి నోట్ల మార్పిడి ప్రారంభమవుతుందని ప్రకటించింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్‌దాస్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.