రేవంత్ అరెస్ట్ నిరంకుశానికి నిదర్శనం
కెసిఆర్‌కు ఓటమి బయం పట్టుకుందన్న మల్లు
జడ్చర్ల,డిసెంబర్4(జనంసాక్షి): రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత,జడ్చర్ల అభ్యర్థి మల్లు రవి అన్నారు. ఇంతకన్నా దారుణం మరోటి లేదన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అరెస్ట్‌లతో భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ప్రచరాంతో కెసిఆర్‌కు గుబులు పట్టిందని అన్నారు. పోలీసులు ఆపద్దర్మ ప్రభుత్వానికి కొమ్ముకాయడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట తప్పి మళ్లీ అధికారంలోకి
రావాలని చూస్తున్నారని అన్నారు. ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని, అధికారంలోకి వస్తే ఎస్సీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారన్నారు. సీఎం కాకముందే కేసీఆర్ అబద్దాలు మాట్లాడారని..అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఎక్కువైందని విమర్శించారు. ఎస్సీలకు మూడు ఎకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు,
రైతులకు రుణమాఫీతో పాటు ఇచ్చిన ఏ హావిూని కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓడి పోతాననే భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. రైతుల ఆత్మహత్యలు, అవినీతిలో తెలంగాణ 2వ స్థానం, నిరుద్యోగంలో 3వ స్థానంలో ఉందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో తెరాస విఫలమైందని పేర్కొన్నారు. ఉద్యోగాలు పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడంతో రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అమలు చేయకుండా మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హావిూలు తప్పకుండా అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని ప్రజలు గుర్తించాలని తెలిపారు.