రేవంత్ జర తగ్గాలె..
– ఎర్రబల్లి, రేవంత్‌ల వాగ్వాదం
హైదరాబాద్ అక్టోబర్24(జనంసాక్షి):
తెలంగాణ టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికపై చర్చించేందుకు శనివారం టీటీడీపీ నేతలు సమావేశమైనపుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ సమావేశంలో ఎర్రబెల్లి, రేవంత్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సీనియర్ నేతలు ఎర్రబెల్లికి మద్దతుగా నిలిచి.. దూకుడు తగ్గించుకోవాల్సిందిగా రేవంత్‌కు హితవు
పలికారు. పార్టీలో సీనియర్లను గౌరవించాలని, వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడటం సరికాదని రేవంత్‌కు
సూచించారు. ఓటుకు కోట్లు కేసు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. దీని వల్ల పార్టీకి భారీ నష్టం జరిగిందని, ఇకనైనా దూకుడు తగ్గించి జాగ్రత్తగా వ్యవహరించాలని రేవంత్‌కు
చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణతో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.