రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం మండల ప్రజలు

 

 

 

 

 

 

 

నయా జోష్ నింపిన రేవంత్ జోడోయాత్ర

సానుకూలంగా స్పందించిన సీతక్క తన వంతు సహాయంగా ఫర్నిచర్ ఇస్తానని హామీ

బాల్కొండ నుంచి గోల్కొండ వరకు ఎగిరేది కాంగ్రెస్ జెండానె… రేవంత్ రెడ్డి

ఏర్గట్ల మార్చ్ 13 (జనంసాక్షి): నిజాంబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలో హాత్ సె హాత్ జోడో పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, సోమవారం ఉప్పులూరు మీదుగా ఏర్గట్ల గ్రామానికి చేరుకొన్నారు. మొదట కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి విద్యార్థినిల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలకు ఫర్నిచర్ కూర్చోవడానికి బెంచీలు డేస్కులు కావాలని అడగగా సానుకూలంగా స్పందించిన సీతక్క వారి సొంత నిధులతో కావాల్సిన ఫర్నిచర్ సమకూరుస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధ్యాయినిల సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయునిలు మాట్లాడుతూ ప్రతి కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయునిలు, చాలిచాలని వేతనాలతో ఇబ్బందులకు గురవుతున్నామని, కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని వినతి పత్రం అందజేశారు.అనంతరం బస్టాండ్ చౌరస్తా వద్దకు చేరుకొని ప్రజలను ఉద్దేశించిప్రసంగించారు.ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే యువకులు మద్యానికి, గంజాయికి అలవాటు పడ్డారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం షాపులు,బెల్ట్ షాపులు వేల సంఖ్యలో ఏర్పడ్డాయని అని అన్నారు. ఏ ప్రభుత్వాలు శాశ్వతం కాదని, రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని 2024 నుండి 34 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంటుంద