రేవంత్ రెడ్డి అనే నేను..
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లు భట్టి విక్రమార్క, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దామోదర రాజనర్శింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ, సీతక్క ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో కేరింతలతో హోరెత్తిన ఎల్బీ స్టేడియం, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు…..
హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి కొలువు దీరారు. నేడు(గురువారం) మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.తెలంగాణ నూతన రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రి, రెండో వ్యక్తిగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు. ఆయనతో పాటు మరో 11 మంది నాయకులు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.మహబూబ్ నగర్ జిల్లాలో 2006లో మిడ్జెల్ జెడ్బీటీసీగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంఎల్‌సీగా గెలిచారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లోనూ మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా.. మరసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. 2021లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంపికై 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం పదవిని చేపట్టారు.సోనియాగాంధీకి పాదాభివందనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు