రేషన్ దుకాణం సీజ్ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం
రేషన్ దుకాణం సీజ్ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం
బదౌన్: సక్రమంగా తన విధులు నిర్వర్తించి నందుకు ఓ ప్రభుత్వాధికారిని సజీవ దహనం చేసేందుకు య్రత్నించారు. దేగావ్ అనే గ్రామంలో రేషన్ దుకాణదారు ఒకరు కిరోసిన్, డీజీల్ కల్తీ చేస్తున్నట్లు సమాచారం అందటంతో జిల్లా పౌరసరఫరాల అధికారి నీరజ్ సింగ్ వెళ్లి అక్కడ తనిఖీలు నిర్వహించారు. తనకు అందిన సమాచారం నిజమేనని తేలటంతో దుకానాన్ని సీజ్ చేసి కార్యలయానికి తిరుగుప్రయాణమయ్యారు. ఇంతలో ఆయన వాహనాన్ని చుట్టిముట్టి 150మంది ఆయనపై కిరోసిన్‌పోసి నిప్పంటించేందుకు యత్నించారు. అతికష్టం మీదా ఆ అధికారి అక్కడినుండి తప్పించుకున్న ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.