రేషన్ బియ్యం అడ్డుకునే మొనగాడే లేడా

రైతులను మోసగిస్తున్న రైస్ మిల్లర్.
*తరుగు పేరుతో లారీకి 3 నుంచి 5 క్వింటాళ్ల తరుగు
 *రైతుల పక్షాన వెళ్లిన మీడియా కు బెదిరింపులు
     *రైతు బాధలను పట్టించుకోని అధికారులు ..
జనం సాక్షి/ కొల్చారం మండలం చిన్నా ఘనపూర్(వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద ఉన్న) తిరుమల రైస్ మిల్ యజమానులు  రైతులను నిలువునా ముంచుతున్నారు. వానాకాలం సీజన్ కు రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణకు అనుమతి తీసుకోవడంలో ఆలస్యం చేసి, ఇప్పటికీ రైస్ మిల్లు కు కోడ్ రాకున్నా వేలాది బస్తాల ధాన్యం రైతుల నుంచి దించుకుని ఇప్పటికీ రైతుల ట్రక్కు షీట్లు కొనుగోలు కేంద్రాలకు పంపకుండా రైతులకు బిల్లులు రాకుండా కారణమౌతుంది. తాలు పేరుతో మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి తీసుకువచ్చిన లారీలను తాలూ పేరుతో ఒక లారీకి ఐదు క్వింటాళ్ల వరకు దోపిడీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యదేచ్చగా దోపిడీ చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఏటిగడ్డ మాందాపూర్ కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి అని రైతు ఆరోపిస్తున్నారు. తాము తీసుకువచ్చిన లారీలో తాలు పేరు ఉందంటూ ఇబ్బంది పెడుతున్నారని బస్తాలను దిగుమతి చేసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల రైస్ మిల్ పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రైతులను మోసం చేయడంతో పాటు రేషన్ బియ్యం కూడా కొనుగోలు చేస్తూ రీసైకిలింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు తిరుమల రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి రైతుల పక్షాన రైస్ మిల్లు లో ఫోటోలు తీస్తుంటే ఎవరి అనుమతి తీసుకుని ఫోటోలు తీస్తున్నారని విలేకరులను దుర్బాషలాడారు. నా ఇష్టం వచ్చినట్లు తీసుకుంటా… లారీకి మూడు నుంచి ఐ

తాజావార్తలు