రేషన్ బియ్యం పట్టివేత
బియ్యం తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అశ్వరావుపేట సెప్టెంబర్ 21( జనం సాక్షి )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అశ్వరావుపేట పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట నుండి నుండి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న డీసీఎం వాహనం పై అనుమానం రావడంతో రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్నా అశ్వారావుపేట ఎస్సై చల్ల అరుణ , కానిస్టేబుల్ రామారావు హోమ్ గార్డ్ రమణ ఆ వాహనాన్ని అపి పరిశీలించిగా ఆ వాహనం సూర్యాపేట జిల్లా నుండి రాజమండ్రి వెళ్తున్నట్టు అందులో 14 క్వింటాలు రేషన్ బియ్యం సుమారు 250 బస్తాలు ఉండడంతో ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు