రైతుకు బీమాతో కొండంత అండ: ఎమ్మెల్యే
సిద్దిపేట,మార్చి19(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రైతుకు బీమా పథకాన్ని తెచ్చారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రైతు బీమా పథకం ప్రపంచ చరిత్రలోనే తొలిసారిదని అన్నారు. రైతుకు ఏ కష్టం వచ్చినా తీర్చేందుకు ముందుంటున్నామని అన్నారు. రకరకాల ఇబ్బందులతో, పంటలపై పెట్టుబడులతో చేతిలో డబ్బులు లేని సందర్భంలో ఏదైనా కారణంతో రైతు మృతి చెందితే ఆ కుటుంబం నిరాధారమై పోతుందన్నారు. లాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి అండగా ఉండాల్సిన ప థకం ఆవశ్యకతను సీఎం కేసీఆర్ గుర్తించారన్నారు.అందుకే రూ. 5లక్షలతో రైతు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించడం పట్ల రైతుల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రైతు కోసం ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారన్నారు. ఎకరానికి రూ. 4వేల చొప్పున రెండు పంటలకు రూ. 8వేలు ఇవ్వడం రైతుబిడ్డగా కేసీఆర్ చేస్తున్న మంచి పనిగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.