రైతును ఆదుకోవడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మెదక్‌,జూలై24(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలను పట్టించుకున్న వారు లేరని నర్పాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ అన్నదాతల కోసం చేపడుతున్న కార్యక్రమాలు వారిలో మనోధైర్యం నింపడంతో పాటు వారికి అండగా నిలుస్తున్నాయని అన్నారు.రైతు బాగుంటేనే పల్లెలు బాగుంటాయని, తద్వారా దేశం బాగుంటందని నమ్మిన సీఎం కేసీఆర్‌ ఆదిశగా రైతన్నల ఇబ్బందులు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణలోని బీడు భూములకు సాగు నీరందించి పచ్చని పంట పొలాలుగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజల గుండెల్లో అపర భగీరథుడిగా ముద్ర వేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో రాబోయే కాలంలో రైతే రాజు కానున్నాడని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి గ్రామ గ్రామాన బలమైన కార్యకర్తలు ఉన్నారని, ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, అన్నదాతలకు అండగా ఉండేందుకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాని సూచించారు.