రైతును రాజుగా చూసేందుకే రైతు సమితిలు-మహేందర్ రెడ్డి
వికారాబాద్,సెప్టెంబర్1(జనంసాక్షి): రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్ దేశంలోనే ఆదర్శ వంతమైన చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం వికారాబాద్ జిల్లాలోని గిర్గిట్ పల్లి, పగిడ్యాలల్లో జరిగిన రైతు సమన్వయ సమితి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సమన్వయ సమితిలకు శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలని సీఎం కేసీఆర్ రైతు సమితిలను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. రైతాంగానికి పంటల సాగు, మద్దతు ధరలు అందించేందుకు సమన్వయ కమిటీలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3.64 లక్షల రైతుల భూముల విూద సర్వే చేయనున్నామని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 1.72 లక్షల మంది రైతుల భూముల సర్వే చేస్తామన్నారు./ుషన్ కాకతీయ, 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ,రుణమాఫీ, ఎకరాకు 4 వేల పెట్టుబడి రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు.