రైతుబంధు కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు
నవంబర్ 2 లోగా రైతుల ఖాతాలో రైతుబంధు జమ చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి జనంసాక్షి, మంథని, అక్టోబర్ 27:
కాంగ్రెస్ పార్టీ రైతుబందుకు వ్యతిరేకం కాదని, రైతులను తప్పుదోవ పట్టించేందుకు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, మంథని ఎంపీపీ కొండ శంకర్ లు అన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక బిఆర్ఎస్ నాయకులు నియమ నిబంధనలను ఉల్లంఘించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఎలా దహనం చేస్తారని ప్రశ్నించారు. శుక్రవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎలక్షన్ లు వచ్చాయని బిఆర్ఎస్ నాయకులు రైతుల మీద మొసలి ప్రేమ చూపుతున్నారని, రైతుల వడ్లు కల్లాలలో నెలల తరబడి ఉన్నప్పుడు ఏ ఒక్క బిఆర్ఎస్ నాయకులు మాట్లాడలేదన్నారు. రైతుల శ్రమని అడ్డగోలుగా తాలు,తరుగు పేరుతో క్వింటాలుకు 10 కిలోల చొప్పున దోచుకున్నది మీ ప్రభుత్వం,మీ నాయకులు కాదా అని వారు ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అని చెప్తూ మోసాగిస్తున్న పార్టీ కనీసం 12 గంటలు కూడా ఇవ్వలేక పోతున్నారని ,కేవలం 8గంటలకే పరిమితం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల బాగోగులు,రైతుల సమస్యలను తెలుసు కునేందుకు కిసాన్ సెల్ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని ఆయన పేర్కొన్నారు. మీకు రైతుల మీద నిజంగానే ప్రేమ ఉంటే నవoబర్ 2 లోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసి రైతుల పట్ల మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని అన్నారు. రానున్న రోజుల్లో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు కుడుదుల వెంకన్న, జనగాం నర్సింగరావు, వైస్ ఎంపీపీ స్వరూప్ రెడ్డి,మంథని డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు మాచిడి రవితేజ గౌడ్.ఎస్సీ సెల్ మంథని మండల అధ్యక్షులు మంథని రాకేష్, మాజీ సర్పంచ్ రామ్ రాజశేఖర్,బీసీ సెల్ మంథని మండల అధ్యక్షులు ఆయిలి శ్రీనివాస్.ఎంపీటీసీ గుమ్మడి సత్యవతి రాజయ్య,నాయకులు కూర కోటేష్,పార్వతి కిరణ్ పటేల్,జాగిరి సదానందం,మంథని మల్లేశం,తోట పాపయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉట్ల అనిల్ రెడ్డి, మంథని శ్రీనివాస్. భాష అశోక్,పి. మోహన్ యాదవ్, పోగుల సాగర్, ఎడ్ల మధుకర్, గుంజ సతీష్ తదితరులు పాల్గొన్నారు.