రైతుబంధు విజయవంతమైన కార్యక్రమం: గుత్తా
నల్లగొండ,మే22(జనం సాక్షి): ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్న ఆత్మవిశ్వాసం తెలంగాణ రైతాంగానికి కలిగిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. పది రోజులుగా కొనసాగుతున్న ఈ పథకంలో కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా వయోభేదం లేకుండా పండుగ వాతావరణంలో రైతాంగం పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని మంత్రి చెప్పారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటి ఐక్యత ముందెన్నడూ కనిపించలేదన్నారు. సామూహి కంగా ప్రజలందరూ కలసి కట్టుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం చారిత్రకంగా నిలిచిపోతుందని.. దేశంలో రైతుల ఐక్యతకు రాష్ట్రం నుంచి తొలి బీజం పడిందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రైఅన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓ వైపు మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు అభివృద్ధి చేస్తూనే పల్లెల్లో మెరుగైన వసతుల కల్పనకు నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విజయం అయ్యిందని అన్నారు. ల్గ/తుబంధు పథకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగిందని.. అన్నారు. తెలంగాణ రైతాంగం అప్పులేకుండా వ్యవసాయం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు చక్కటి ఫలితం వచ్చిందని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోనే తొలిసారి రైతాంగం ఐక్యతకు రాష్ట్రంలో బీజం పడిందని చెప్పారు. ఇప్పటికే 75 శాతం పైగా చెక్కులను రైతులకు అందజేశామని, మిగతావి ఈ వారం చివరికి పూర్తవుతాయని తెలిపారు. రైతుబంధు విజయవంతంలో అధికారుల పాత్ర అభినందనీయమని.. బ్యాంకులు కూడా ఎలాంటి నగదు కొరత ఇబ్బందులు రాకుండా.. వచ్చిన రైతులను ఇబ్బంది పెట్టకుండా సహకరించాయని మంత్రి కొనియాడారు. అక్కడక్కడా కిందిస్థాయి సిబ్బంది కొందరు మాత్రం పాత పద్ధతులు మార్చుకోలేదని.. వారిపై చర్యలు ఉంటాయన్నారు. పాస్ పుస్తకాల్లో దొర్లిన అక్షర దోషాల సవరణకు అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికగా పని చేస్తుందని వివరించారు.