రైతుబంధు సాయం వదులుకున్న ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌

రైతులకు అండగా సిఎం కెసిఆర్‌ ఉన్నారని వెల్లడి
నల్లగొండ,మే10(జ‌నం సాక్షి):  పంట పెట్టుబడి సాయాన్ని వదులుకుంటున్నట్లు నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌ నాయక్‌ తెలిపారు. తన పేరున ఉన్న ఏడు ఎకరాలకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందజేసే నగదును తిరిగి ప్రభుత్వానికే ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రైతుబంధు పథకం గురువారం  రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. దేవరకొండలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ పాల్గొని లబ్దిదారులైన రైతులకు పట్టా పాసుపుస్తకాలు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం దండగ కాదు పండుగ అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందన్నారు. గత పాలకులు రైతుల నడ్డి విరిస్తే కెసిఆర్‌ వారికి ఆసరగా నిలిచారని అన్నారు.  వ్యవసాయం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
రైతు బిడ్డ సీఎంగా ఉండటం తెలంగాణ ప్రజలకు వరం అన్నారు. ఇచ్చని, ఇవ్వని  హావిూలు మొత్తం నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. గత పాలకులు రైతుల కోసం చేసిందేవిూ లేదని, జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి రైతులను మోసం చేశరాని అన్నారు.  అప్పు లేకుండా రైతు వ్యవసాయం చేయడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రైతుబందు పథకం రైతులకు అద్భుత వరం అని,  రైతుబంధు ద్వారా  ఎకరాకు 4వేల సాయం అందుతున్నదన్నారు.
————–