రైతుబజార్‌లో రైతులు పడుతున్న సమస్యలను తెలుసుకున్న సీఈఓ

గుమ్మడిదల: గుమ్మడిదల రైతు సంఘ భవనంలో రైతులతో రైతుబజార్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ సమావేశమయ్యారు. రైతు బజార్ల పనితీరు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారమార్గాలను సూచించారు. ఆయన వెంట జిల్లా ఉద్యానవన శాఖాధికారులు, శేఖర్‌, చక్రపాణి, రాష్ట్ర అధికారి సత్తార్‌ తదితరులున్నారు.