రైతుబిడ్డ సిఎంగా ఉండడం వల్లనే పండగయిన వ్యవసాయం

దోసపాడు గ్రామంలో రైతుబంధుకు శ్రీకారం
వ్యవసాయం కోసం ఎంతయినా ఖర్చు చేస్తామన్న మంత్రులు
సూర్యాపేట,మే10(జ‌నం సాక్షి): రైతుబిడ్డ సీఎంగా ఉండటం తెలంగాణ ప్రజలకు వరం అని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని దండగ కాదని, పండగ చేసి చూపిస్తున్న ఘనత కెసిఆర్‌దని అన్నారు. సూర్యాపేట  జిల్లా పెన్‌ పహాడ్‌ మండలం దోసపాడు గ్రామంలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ,¬మ్‌ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి,రైతు సమన్వయ సమితి రాష్ట్ర అద్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య, కలెక్టర్‌ సురేంద్ర మోహన్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఏ రజాక్‌, గ్రంధాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, సూర్యాపేట మున్సిపల్‌ చైర్పర్సన్‌ ప్రవల్లిక ప్రకాష్‌, పెన్‌ పహాడ్‌ జడ్పీటీసీ కోటేశ్వర రావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ… వ్యవసాయం దండగ కాదు పండుగ అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది. గత పాలకులు రైతుల నడ్డి విరిచారు. వ్యవసాయం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  చెప్పిన హావిూలు మొత్తం నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు.  గత పాలకులు రైతుల కోసం ఏడ్చినట్లు నటించారు. అప్పు లేకుండా రైతు వ్యవసాయం చేయడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.  ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 905 కోట్ల రైతు బంధు సాయం అందుతోందన్నారు. .జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన 92 శాతం పూర్తయింది. సూర్యాపేట జిల్లాలో రైతుబంధు సాయం 238 కోట్లుగా చెప్పారు. రైతుబందు పథకం రైతులకు అద్భుత వరం అన్నారు. .గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతుబంధు ద్వారా సాయం అందుతున్నదన్నారు.  రైతుబంధు పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఎంపి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు.  గత పాలకుల హయాంలో వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి వ్యవసాయం పండగులా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. . రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులకు రూ.12 వేల కోట్ల పెట్టుబడి సహాయం రెండు విడుతలుగా అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో రైతులకు పాస్‌పుస్తకాలతో పాటు  పెట్టుబడులు అందిస్తున్నం. రైతులకు కోట్లాది నిధులతో వ్యవసాయ మంత్రాలు, అంతరాయం లేకుండ 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నో పథకాలతో ఇప్పటికే దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని డిప్యూటి సిఎం మహ్మూద్‌ అలీ అన్నారు.  ఇప్పుడు రైతుబంధు ద్వారా మరోసారి దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.  అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి, పంటకు 4 వేల రూపాయలను పెట్టుబడి సాయంగా అందజేస్తాం. ప్రతి ఏటా రెండు పంటలకు రైతులకు సహాయం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 90శాతం మంది సన్న, చిన్నకారు రైతులకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే 24 గంటల ఉచిత విద్యుత్‌ అందుతుంది. నీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఇక వ్యవసాయం అంటే పండుగే అనే రోజులు తెచ్చామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి పథకం దేశానికే ఆదర్శమని మంత్రి నాయిని నర్సింహారెడ్డి  అన్నారు. రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. సీఎం కేసీఆర్‌
రైతు బాంధవుడని స్పష్టం చేశారు. ప్రజాహిత కార్యక్రమాలతో సీఎం కేసీఆర్‌ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలతో పల్లెలన్నీ బాగుపడ్డాయని..ఇంకా బాగుపడాల్సిన అవసరముందని నాయిని అభిప్రాయపడ్డారు.
————-