రైతుబీమాతో అన్నదాతలకు అండగా నిలిచాం
నిరంతర విద్యుత్‌తో విప్లవం తెచ్చాం
కాంగ్రెస్‌ను నమ్మకుంటే చంద్రబాబు పెత్తనం తప్పదు
ఓటుతో వారికి బుద్ది చెప్పాలి
తుంగతుర్తి సభలో సిఎం కెసిఆర్
నల్గొండ,నవంబర్23(జనంసాక్షి): ల్గ/తుబంధు, రైతు బీమాతో అన్నదాతలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్నదని, ప్రపంచంలోనే టాప్ 10 పథకాల్లో రైతు బంధు ఒకటని ఐక్యరాజ్యసమితి చెప్పిందని సిఎం కెసిఆర్ అన్నారు. రైతుబంధు కంటే గొప్ప పథకం రైతుబీమా పథకం. ఎలాంటి పైరవీకి తావులేకుండా చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందచేస్తున్నామని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు చాలా పార్టీలు చాలా విషయాలు చెబుతాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ నేతలు. వందలమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే.. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ ఆలస్యం చేసింది. యుద్ధం చేసి వలసాధిపత్యం నుంచి బయటపడ్డాం. మోసపోతే మళ్లీ గోసపడతాం. చంద్రబాబును మళ్లీ మనపై రుద్దాలని చూస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి
చెప్పాలన్నారు. చంద్రబాబు పెత్తనం మళ్లీ మనకు కావాలా అని అడిగారు. తుంగతుర్తి నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. పోరాటాలకు నిలయమైనగడ్డ తుంగతుర్తి అని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం తిరుమలగిరిలో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గ్యాదరి కిశోర్‌కుమార్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి జగదీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక వైపు రాష్ట్రాన్ని సాధించి నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్‌ఎస్ ఉంది. మరోవైపు 58ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఉన్నాయి. టీఆర్‌ఎస్ ఏం చేసిందో.. కాంగ్రెస్, టీడీపీలు ఏం చేశాయో ప్రజలకు తెలుసు. ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్ పోతే వార్త. అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అందిస్తున్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో మనమే నంబర్ వన్. కరెంట్ కోసం మంత్రి జగదీష్‌రెడ్డి ఎంతో కష్టపడ్డారు. ఎవరూ పట్టించుకోని ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు రూ.1000 పెన్షన్ ఇస్తున్నాం. భూమిశిస్తు, నీటి తీరువా మొత్తం రద్దు చేశాం. రుద్రమదేవి చెరువు సామర్థ్యాన్ని మూడున్నర టీఎంసీలకు పెంచుతామని పేర్కొన్నారు.
కాంగ్రెస్, టీడీపీ హయంలో కరెంట్ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో ఆలోచన చేయాలి. ఇప్పుడు మోటారు కాలదు.. ట్రాన్స్‌ఫార్మర్ కాలదు. తెలంగాణ వస్తే చీకటి అలుముకుంటదని సమైక్య పాలకులు శాపాలు పెట్టినారు. ఏడాదికి రెండు పంటలు పండించుకోవచ్చు. ప్రజలు గెలిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం. ఇప్పటి వరకు నా సభలకు 3 లక్షలకు పైగా జనం వచ్చారని కేసీఆర్ వివరించారు. నియోజకవర్గ స్థాయి సభలన్నీ జిల్లా స్థాయి సభల్లా జరుగుతున్నయన్నారు. ఎన్నికల సమయంలో చాలా మంది చాలా మాటలు చెప్తరు. ఓటు ఆశామాషీగా వేయొద్దు. అది మన తలరాత మార్చుకునే ఆయుధం. ఓటు వేసే ముందు అన్ని ఆలోచించుకొని ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏది మంచో..ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్యంతో ఏది మంచిదైతే అదే గెలవాలి. టీఆర్‌ఎస్ పాలన రాకముందు కరెంట్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో విూకు తెలుసు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో మనమే నంబర్ వన్. రాత్రి, పగలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చినమని సీఎం తెలిపారు.వచ్చే జూన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు పొలాలకు అందుతుంది. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు వేసినా..ప్రాజెక్టుల నిర్మాణం ఆపలేదు. కేసీఆర్ కిట్ ద్వారా లక్షలాది మంది ఆడబిడ్డలకు మేలు జరుగుతోంది. గతంలో మహిళల ప్రసవాల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేశారు. ఇప్పుడు ప్రసవాల కోసం ఖర్చు చేయకుండా ప్రభుత్వమే రూ.12 వేల కేసీఆర్ కిట్ వస్తోంది. మానవీయ కోణంలో ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పాలన సాగిస్తున్నామని సీఎం పునరుద్ఘాటించారు.