రైతుబీమా మరో చారిత్రక నిర్ణయం: నిరంజన్
మహబూబ్‌నగర్,మే30(జనం సాక్షి): దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ వర్తించేలా రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎక్కడా ఇంతంటి మహత్తర పథకం లేదన్నారు. రైతులకు ఇదో భరోసా అన్నారు. ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమలవుతుందని అన్నారు. రైతులకు మరణం సంభవింస్తే ఆ కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడడాన్‌ఇన గమనించిన సిఎం కెసిఆర్, ఇక నుంచి రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకూడదని రైతులందరికీ బీమా పథకాన్ని ప్రవేశ పెడుతున్నారని అన్నారు. రైతులకు అండగా నిలవాలనే లక్ష్యంతో చేపట్టిన బీమా విషయంలో అందరికీ తెలిసేలా చూడాలని కార్యకర్తలను కోరారు. రైతు దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే రూ. 5 లక్షలు బీమా వర్తించేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 58 లక్షల మంది వరకు రైతులు ఉన్నారని వారిలో 40 లక్షల వరకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇచ్చారని అందరికీ ఇది వర్తింస్తుందని తెలిపారు. సహజంగా బీమా అంటే ప్రమాదాలకు వర్తిస్తుంది కానీ ఇది అందరికీ వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రైతుల కష్టాలు తీర్చాలనే ఉద్ధేశ్యంతో తెలంగాణ సర్కారు రైతు పక్షాన నిలబడి దేశం గర్విచేలా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు కోసం తీసుకున్న మరో కీలక నిర్ణయం రైతు బీమా అన్నారు.