రైతుమిత్ర పురుగులను వృధి చేసుకోవాలి.
నెరడిగొండ సెప్టెంబర్16(జనంసాక్ష:
పత్తి పంటలో గులాబీ రంగు పురుగుల నివారణకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని దేష్పాండే ఫాండేసన్పిల్డ్ అసిస్టెంట్ ఇందల్ జాధవ్ అన్నారు. శుక్రవారం రోజున దేష్పాండే ఫౌండేషన్ బీసీఐ ఆధ్వర్యంలో మండలంలోని సంక్రాపూర్ గ్రామంలో డెమో వ్యవసాయ క్షేత్రంలో రైతులకు అవగాహనా కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ముఖ్యంగా పురుగు మందు పిచికారీ సమయంలో కనీస రక్షణ సామాగ్రి ధరించి పిచికారీ చెయ్యాలని,మీరువాడే రసాయన పురుగు మందులు విసికారితో కూడుకున్నవి అందుచేత రైతులు తమ ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవాలని పంటపొలలో గులాబీ రంగు పురుగు నివారణకు లింగర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని,పురుగు మందు డబ్బాలను నదిలో కానీ కుంటలో కానీ కడగారాదని ఆలా చెయ్యడం ద్వారా నీటిలో మందు కూలిసితమై అవి మానవ మనుగడకు హాని కలుగజేస్తుంది.పత్తి పంటలు మిత్ర పురుగులను వృధి చేసుకోవాలని రైతులకు తెలియజేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఇందల్ జాదవ్ రాథోడ్ శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు.