రైతులకు అండగా ప్రభుత్వం

సమస్యలుంటే దృష్టికి తీసుకుని రండి
మెదక్‌,మార్చి19(జ‌నంసాక్షి): రైతులకు ఎలాంటి ఆపదలు, సమస్యలు ఎదురొచ్చినా పరిష్కారం కోసం అధికారులు, పాలకుల దృష్టికి తేవాలని ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి  అన్నారు.  రైతుల ఆత్మహత్యలు ఎక్కడా వినపడొద్దని కోరారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమస్యలు పరిష్కారం చేసేందుకు ఎప్పడు సిద్ధమేనని ఆయన అన్నారు. రైతుల సంక్షేమాభివృద్ధికి సర్కారు ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు.రైతులు తమ సమస్యలపై అధైర్య పడొద్దని ఆయన హితవు చేశారు.. రైతుల సంక్షేమం కోసం సర్కారు కొత్తగా ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్నట్లు చెప్పారు.  రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో పని చేస్తుందని, రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు.   రాష్ట్ర సర్కారు ఇరిగేషన్‌ కోసం పెద్ద పీట వేసిందని, ఈక్రమంలో ఒక ఎకరం పంట కూడా ఎండిపోకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీరివ్వాలనే లక్ష్యంతో అభివృద్ధి పనులు చేపడుతున్నదని పేర్కొన్నారు.  రైతుల మేలు కోరి రైతు శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కారు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి, పంటల సాగు, వాటి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, కావాలనే రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్‌ నాయకులు రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని  ఆయన ప్రశ్నించారు. రైతులకు వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని ఎప్పుడు నమ్మొద్దని ఆయన తెలిపారు.  . రైతులు బాగుంటనే దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతులు సుఖః సంతోషాలతో ఉన్నప్పుడే ఆశించినంత ధాన్యం, పంటల దిగుబడి సమృద్ధిగా వస్తుందన్నారు. ఈ ఏడాది నుంచే ఎకరానికి రెండు పంటలకుగాను రూ10 వేలు అందిస్తుందని, 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా, వారు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు మద్దత్తు ధర ప్రకటించి అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇకపై ప్రతి గ్రామంలో మద్దతు ధరతో వడ్లు కొనుగోలు చేస్తారని చెప్పారు.