రైతులకు అందుబాటులో పథకాలు

ఆదిలాబాద్‌,మే25(జ‌నంసాక్షి): చెక్కుల చెల్లింపు కార్యక్రమం జోరుగాసాగుతోంది. రైతులు పాస్‌ పుస్తక వివరాలతో పాటు పాటు ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, పాస్‌ ఫొటోలు అందజేయాలన్నారు. డబ్బులు చెల్లించాలంటే రైతుల వివరాలు ముఖ్యమన్నారు. రైతు సమగ్ర సర్వేలో భాగంగా గ్రామాల్లో సర్వేను చేపట్టాకనే పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందచేశారు. రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలకు ఈ పెటటుబడి అదనమని ప్రభుత్వం తెలియచేసింది. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వానా కాలంలో పత్తికి బదులు, సోయాబీన్‌, కందులు, ఇతర తృణధాన్యాల పంటలు వేసుకోవాలని సూచించిందన్నారు. తీరా పంట దిగుబడులు వచ్చాక వారికి గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు.