రైతులకు అవగాహన సదస్సు

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలోని రైతు ఐక్యవేదిక లో రైతులకు అవగాహన సదస్సు వ్యవసాయ అధికారి యోగితా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిఎం కిషన్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతుల తమ యొక్క ఆధార్ కార్డు, పటా పాస్ బుక్ వెంట తీసుకొని రాగలరని తెలిపారు. చివరి తేదీ 31 ఆగస్టు వరకు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. నమోదు చేసుకుని వారికి సంవత్సరానికి 6000 రూపాయలు లబ్ధి పొందాలని తెలిపారు, కార్యక్రమంలో జడ్పిటిసి నాగం భూమయ్య, ఏఎంసీ చైర్మన్ వర్దిని నాగేశ్వరరావు, ఎంపీపీ జవ్వాది రేవతి గణేష్ వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి లింబాద్రి, సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు