రైతులకు ఆపద్బంధు మన సిఎం కెసిఆర్‌

రైతుబంధుతో మారనున్న దశ
మహబూబ్‌నగర్‌,మే8(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతు బిడ్డ కావున రైతుకు అండగా  వారి సంక్షేమం కోరుకుంటున్నారని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతుబంధు అమలు బంగారు తెలంగాణలో భాగమన్నారు. ఈ కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నారని అన్నారు.  రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూసే రోజులు వస్తాయని అనుకోలేదని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా రైతుబంధు పథకాన్ని రూపకల్పన చేశారన్నారు. రైతు బంధు పథకం కింద రూ.4 వేల చెక్కులు అందే వరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా కార్యకర్తలు అండగా ఉండాలని  పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని మన ఇంటి పండుగల విజయవంతం చేయాలని కోరారు. ప్రతి మండలంలో గ్రా మాలకు వచ్చి రైతులు పొందే అనుభూతిని కళ్లారా చూస్తామన్నారు. కష్టాన్ని నమ్ముకుని ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నలకు నిలిచిన గొ ప్పు ముఖ్యమంత్రిఅని అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలని కోరుకున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు విడుదల చేసి నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపిన ఘతన ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వేసవిలో కూడా పంట పొలాలు పచ్చగా ఉన్నాయంటే అది కెసిఆర్‌కు రైతులపై ఉన్న మమకారమని తెలిపారు. ప్రతి రైతుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.15 వేల కోట్లతో రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. రైతుబంధు పథకం కింద రైతులకు రూ.12 వేల కోట్లు ప్రతి ఏటా ఇస్తుందని అన్నారు. ఈ పథకం ఎన్నికల హావిూలో వాగ్ధానం చేయలేదని గుర్తు చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ 70 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వం చూపలేదని, కనీసం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఎంఎల్‌ఎ ఆవేదన వ్యక్తం చేశారు. రాను న్న కాలంలో రైతుల సంక్షేమం కోసం రూ.50 వేల కోట్లు బడ్జెట్‌లో ఖర్చు చేసేందుకు ప్రణాళికా సిద్ధం చేస్తుందన్నారు.