రైతులకు ఇచ్చేరుణాల పరిమితి పెంచాలి.
పెద్దూరు వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్ బర్కం వెంకటలక్ష్మి
రాజన్నసిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 20,(జనం సాక్షి). రైతులకు ఇచ్చే రుణాలకు పరిమితి పెంచాలని పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్ బర్కాం వెంకటలక్ష్మి కోరారు. మంగళవారం చైర్పర్సన్ బార్కం వెంకటలక్ష్మి అధ్యక్షతన వార్షిక మహాసభ జరిగింది. మహాసభలో ఆడిట్ విషయంలో పలువురు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కార్యనిర్వాహన అధికారి సమాధానం పై సంతృప్తి చెందకపోవడంతో గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది.
పలు తీర్మానాలు ఆమోదిస్తూ రైతులకు ఇచ్చే రుణాల పరిమితి పెంచాలని కోరుతూ తీర్మానం చేసినట్లు ఈ సందర్భంగా చైర్పర్సన్ బార్కం వెంకటలక్ష్మి తెలిపారు. మహాసభ సభ్యులు మున్సిపల్ విలీనంపై అసాహనం వ్యక్తం చేస్తూ తిరిగి గ్రామపంచాయతీలను కొనసాగించాలంటూ సంతకాల సేకరణ చేపట్టడం చర్చనియాంశంగా మారింది. సమావేశంలో పాలకవర్గ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.