రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు
వరంగల్,డిసెంబర్21(జనంసాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్ అధికారులు సూచించారు. మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని జేసీ ఆదేశించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నాణ్యత ప్రమాణాలు
కలిగిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. ఇకపోతే కంది పంట సాగు పెరిగిందని, పెద్ద ఎత్తున దిగుబడి వచ్చే అవకాశం ఉందని, కంది చేల కోత ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. కంది పంట కోత దశకు చేరుకున్న తరుణంలో, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనపై ముందస్తు ఏర్పాట్లకు సిద్ధం కావాలని సూచించారు.