*రైతులకు కంది విత్తనాలు ఉచ్చిత పంపిణీ*
పెబ్బేరు మండలంలోని జనం పల్లి గ్రామంలో జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా రైతులకు పప్పు దినుసులు పంట అయినటువంటి కంది విత్తనాలైనటువంటి ఎల్ ఆర్ జి-52 అనబడు విత్తనం రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు పంట మార్పిడి చేసుకోవాలని పప్పు దినుసులు విస్తీర్ణం మరియు ఉత్పత్తి పెంచాలని రైతులకు సూచించారు. కంది పంట విత్తనం ఖర్చు తక్కువ మరియు ఎరువుల మోతాదు ఎకరాకు ఎన్ని 18 కేజీలు యూరియా, 50 కె జి డి ఏ పి వేసుకుంటే సరిపోతుందని రైతులకు కూలీల ఖర్చు తక్కువగా ఉంటుందన రైతులకు సూచించారు. అదేవిధంగా విత్తనానికి ఎకరానికి 4 కేజీ కంది విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది చెప్పారు. అదేవిధంగా 45 రోజుల దశలో కొమ్మ కత్తిరింపుల చేయడం ద్వారా ఎక్కువ పూత కాయ వస్తుందని చెప్పారు. సాలుకు సాలుకు 6 అడుగులు మొక్కుకో మొక్కుకు 3అడుగులు వేసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు, జనం పల్లి మరియు మునగ మన దిన్నె గ్రామాల రైతులకు రైతు వేదిక ద్వారా రైతు సోదరులకు కంది విత్తనాలు ప్రతి సబ్సిడీని రైతు వేదిక ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేసుకోవాలి దానితోపాటు సహజంగా దొరికే జీవన ఎరువులు మరియు పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలని రైతులకు చెప్పారు.కార్యక్రమంలో వి నరేష్ గ్రామ సర్పంచ్ రాజవర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ అయ్యప్ప రెడ్డి, సత్యనారాయణ రెడ్డి ,బీచుపల్లి, వెంకటరెడ్డి, నరసింహరెడ్డి, దామోదర్, రాజు, హనుమన్న, పరుశరాముడు, వెంకన్న, కృష్ణారెడ్డి, నారాయణ గ్రామ రైతులు పాల్గొన్నారు.