రైతులకు పెట్టుబడి సాయం అందకుండా కాంగ్రెస్ కుట్ర..!

రైతులకు పెట్టుబడి సాయం అందకుండా కాంగ్రెస్ కుట్ర..!

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 26 : కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండల శాఖ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయినంక కొత్త పథకాలు అమలు చేయరాదు.. పాత పథకాలు అమలు కొనసాగించావచ్చునేనే విషయం అందరికి తెల్సిందే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యారావ్ ఠాక్రె మాత్రం ఈ ప్రాథమిక విషయం తెలిసీ తెలంగాణ రాష్ట్రంలో అమలావుతున్న పథకాలను నిలిపి వేయాలని ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు యాసింగి లో పెట్టుబడి సాయం అందించే రైతు బందు పథకాన్ని నిలిపి వేయాలంటూ ఎన్నికల కమీషన్ కు లేఖ రాసి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా కాంగ్రెస్ కుట్ర పూరీతంగా వ్యవహారిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ వ్యవహారిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజల పై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ అని తేటతెల్లామైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం కాకుండ ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం పాటు పడే పార్టీ అన్నారు. గతంలో ఎన్నికల మేనిపెస్టో లో పెట్టని అనేక పథకాలకు రూప కల్పన చేసి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ దేనాన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిపెస్టో చూసి కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు గురైందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, పెంచికల్ పేట్ సర్పంచ్ కొండ వెంకటేష్, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండి. ఇంతియాజ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడప కృష్ణమూర్తి, మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, ఉప సర్పంచులు బొజ్జ రాజసాగర్, జాబు సతీశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇనగంటి రామారావు, నీలం శ్రీనివాస్, పెండ్లి నారాయణ, దామెర సంపత్, మేడగొని విజయ్ గౌడ్, తోట వీరయ్య, వెంగలి రాజయ్య, ఎలబోయిన రాంమూర్తి, కమ్మగోని అనిల్, మెరుగు కుమార్, అవునూరి కిరణ్, జాబు శ్రీనివాస్, గడ్డం ప్రకాష్, ఐట్ల పవన్ కళ్యాణ్, ఆకుల బాపు, చిప్పకుర్తి శివలింగం, పోట్ల శంకర్, సవాయి శంకర్, పోతుల శివ, జంగపల్లి అనిల్, చెన్నోజు చంద్రశేఖర్, కొండ రమేష్, మల్యాల తిరుపతి, దాసరి శాంతికుమార్, ఢీకొండ పెద్ద కొమురయ్య, ఉండుంటి శేఖర్, శ్రవణ్, రాజు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.