రైతులకు పెద్ద పీఠ వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
– ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
మునగాల, నవంబర్ 09(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీఠ వేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. బుధవారం మునగాల మండలంలోని తాడువాయి సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు, పథకాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. సాగు నీటిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో రాష్ట్రంలో అనూహ్యంగా పంట దిగుబడి పెరిగిందని ఆయన అన్నారు. దళారుల బెడదను అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రహించి మద్దతు ధర పొందాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలను గుర్తించి అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల బారి నుంచి అదుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర రూ.2060 అందిస్తున్నదున ఎండ బెట్టిన నాణ్యమైన దాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. గ్రామీణ ఆర్దిక వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. పెట్టుబడి సాయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కొత్త చరిత్రను సృష్టించిందని రైతు శాసించే స్థాయికి ఎదగాలని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి తికువచ్చిన ఘనత బంగారు తెలంగాణ స్వాపనికుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదని ఆయన గుర్తుచేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోని విధంగా రైతులకు పెట్టుబడి ఎకరానికి పంటకు 5వేల రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన అన్నారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వైపే చూస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, డిఆర్డిఎ పిడి కిరణ్ కుమార్, ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు తొగరు సీతారాములు, కందిబండ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, టిఆర్ఎస్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, కోల ఉపేందర్ రావు, యుగంధర్ రెడ్డి, ఎలక వెంకట్ రెడ్డి, గన్న నరసింహారావు, వీరబాబు, సైదా, ప్రదీప్, నాగిరెడ్డి, లక్యా నాయక్, ఎల్పి రామయ్య, గ్రామ టిఆర్ఎస్ నాయకులు సర్పంచ్ లు సంజీవ, మంగయ్య, ఉపేందర్, రమ శ్రీనివాస్, ఎంపీటీసీలు, మోహన్, ప్రజాప్రతినిధులు, గట్టు ఉపేందర్, పత్తిపాక లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రాంబాబు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ReplyForward
|