రైతులకు బీమా బాండ్లను అందచేసిన గుత్తా

నల్గొండ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు సామూహిక జీవిత బీమా పథకంలో భాగంగా ఆలగడపలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌ రావు రైతులకు ఎల్‌ఐసీ బాండ్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది రైతులకు ‘రైతు బీమా’పత్రాలను పంపిణీ చేసేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. సోమవారం నుంచిగ్రామసభలు నిర్వహించి రైతులకు బీమా బాండ్లను అందజేస్తోంది. సభలో జీవిత బీమా బాండ్లను అర్హులైన రైతులందరికీ ఇవ్వనున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే వీరేశం రైతు బీమా బాండ్లను రైతులకు అందజేశారు.