రైతులకు మద్దతు ధర ఇప్పిచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన వెంకట్ రెడ్డి.

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.ఆరు నెలల పాటు రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన పంటకు సరైన ధర ఇప్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన వెంకట్ రెడ్డి విమర్శించారు.శనివారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం క్వింటాల్ 2300 ఖరీదు చేసిన మిల్లర్లు ఈరోజు కనీసం 1900 రూపాయలకు కూడా కొననీ పరిస్థితి ఎదురైంది.రైతులకు సరైన ధర ఇవ్వకుండా నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తున్న మిల్లర్లపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోకుండా మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్న కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వాలకు రైతులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది..ఒకపక్క రైతులు సరైన ధర రాక ఇబ్బందులు పడుతుంటే స్థానిక టిఆర్ఎస్ నాయకులు గానీ స్థానిక శాసనసభ్యులుగాని రైతుల గురించి పట్టించుకోకుండా దళిత బందును ఎరగా చూపించి అమాయక దళిత యువకులను దళిత బంధు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి పార్టీలో చేర్చుకునే కార్యక్రమం చేపట్టడం సరైనటువంటి పద్ధతి కాదని విమర్శించారు.ఇప్పటివరకు దళితులను ఎన్నో రకాలుగా మోసం చేసి దళిత బంధు పేరుతో మరొకసారి మోసం చేసే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది.గత ఆరు నెలలుగా దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి ఎంతోమందిని చేర్పించుకొని నేటి వరకు ఒక్కరికి కూడా దళిత బంధు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో అమాయక దళిత యువకులని కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను పార్టీ లో చేర్చుకుని వారిని మోసం చేసి అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి స్థానిక నాయకులకు కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా బుద్ధి చెబుతుందని ఘాటుగా విమర్శించారు..పార్టీలో చేరికల మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతులు పండించిన పంటని సరైన ధర ఇప్పిచ్చే దానిపై శ్రద్ధ పెడితే రైతుల కష్టాలు తీరుతాయి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తాళ్ల రామకృష్ణారెడ్డి,కౌన్సిలర్లు ప్రకాష్ నాగయ్య,జితేందర్ రెడ్డి,మండల కిసాన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖాదర్ ఖాన్,సురేష్ రెడ్డి,నూకల వెంకట్ రెడ్డి,కొప్పుల శ్రీను,లీలామణిష్ రెడ్డి,గజ్జల కోటేశ్వరరావు,నర్సిరెడ్డి, సైబాల్,సైదా నాయక్,రాము,జానకిరామ్ రెడ్డి,మురళి,రజాక్, కాశి,నగేష్,తదితరులు పాల్గొన్నారు.