రైతులకు మేలు చేసేందుకే రుణ మాఫి – మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్


జనంసాక్షి , మంథని : రైతులకు మేలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ ప్రకటించి అమలు చేస్తుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. శనివారం మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంథని సింగిలి విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, సంఘం యందు 11-12-2018 వరకు 826మంది రైతులకు గాను లక్ష రూపాయల లోపు రూ. 4 కోట్ల 87లక్షల 74వేల 088 జాబితాను ఉన్నతాధికారులకు నివేదించగా ఇప్పటి వరకు మన సంఘమునకు 408మందికి గానూ రూ.1 కోటి 99లక్షల 31వేల 369 రుణ మాఫీ డబ్బులు రైతుల యొక్క రుణ ఖాతాలకు జమ అయ్యాయని తెలిపారు. సంఘమునకు ఇంకా లక్ష రూపాయల లోపు 418 మందికి గానూ రూ.2 కోట్ల 88లక్షల 42వేల 719 డబ్బులు రైతుల ఖాతాలకు జమ కావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. రైతులు తమను తాము నిలదొక్కుకునెలా రైతులకు ఋణమాఫి, రైతు భీమా, రైతు బంధు, సకాలం లో రైతులకు ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారని అన్నారు. రైతును రాజు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణ మాఫీ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ లకు ఈ సందర్భంగా సంఘ చైర్మన్ కొత్త శ్రీనివాస్, సంఘ పాలకవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, మాచీడి రాజుగౌడ్, ఆకుల రాజబాపు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిమూర్తి ఓదెలు, పోచం, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మీ-మొండయ్య, ఉడుత మాధవి-పర్వతాల్ యాదవ్, దేవళ్ల విజయ్ కుమార్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ పాల్గొన్నారు.